అమరోద్ధారీ వాసవాంబ
ఆది మూలమే వాసవాంబ
ఇచ్చాశాక్తివి వాసవాంబ
ఈశ్వరి వమ్మ వాసవాంబ
ఉమా మహేశ్వరి వాసవాంబ
ఊర్ధ్వ కుండలి వాసవాంబ
ఋషి గణ సేవిత వాసవాంబ
ఎంతటి రూపము వాసవాంబ
ఏకైక జననీ వాసవాంబ
ఐహిక దాయకి వాసవాంబ
ఒకే స్తోత్రము వాసవాంబ
ఓంకార రూపిణి వాసవాంబ
ఔరస లాలిత వాసవాంబ
అంబ శాంభవి వాసవాంబ
అహంకార నాశిని వాసవాంబ
కరుణా సాగారి వాసవాంబ
ఖగవాహన ప్రియ వాసవాంబ
గీతా మాతవే వాసవాంబ
ఘంటా నాదిని వాసవాంబ
జ్ఞాన స్వరూపిణి
చారు హాసిని వాసవాంబ
ఛత్ర కిరీటి వాసవాంబ
జన్మనివారిణి వాసవాంబ
అనంత రూపిణి కన్య్యకాంబా
ఇంద్రియనిగ్రహి కన్య్యకాంబా
ఆత్మస్వరూపిణి కన్య్యకాంబా
ఈప్సిత దాయకి కన్య్యకాంబా
ఉగ్రరూపిణి కన్య్యకాంబా
ఊరక స్మరింతు కన్య్యకాంబా
ఋత్విక్ పోషికి కన్య్యకాంబా
ఎన్నగ రానీ కన్య్యకాంబా
ఏక స్వరూపిణి కన్య్యకాంబా
ఐక్యము గూర్పవే కన్య్యకాంబా
ఒకే శక్తివే కన్య్యకాంబా
ఓర్పులనిమ్మా కన్య్యకాంబా
ఔదార్యదాయిని కన్య్యకాంబా
అంత్యము లేని కన్య్యకాంబా
ఆహార ప్రియ కన్య్యకాంబా
కైలాస వాసి కన్య్యకాంబా
ఖడ్గ ధారిణి కన్య్యకాంబా
గాన విలోలిని కన్య్యకాంబా
ఘణఘణ శబ్దిని కన్య్యకాంబా
జ్ఞాన ప్రదాయిని కన్య్యకాంబా
చిత్ప్రకాశినీ కన్య్యకాంబా
ఛత్ర ధారివే కన్య్యకాంబా
జగన్మాతవూ కన్య్యకాంబా
ఝంకారోన్నత వాసవాంబ
టంకా ధ్యాయుధి వాసవాంబ
డంబ వినాశిని వాసవాంబ
ఢక్కానాదిని వాసవాంబ
తన్మయి చిన్మయి వాసవాంబ
దయాంబు రాశివి వాసవాంబ
ధర్మపాలినీ వాసవాంబ
నానాలంకృత వాసవాంబ
పెనుగొండ వాసిని వాసవాంబ
ఫలపుష్ప భరితే వాసవాంబ
బంధ నివారిణి వాసవాంబ
భద్రకాళీ శ్రీ వాసవాంబ
మహిష మర్ణినీ వాసవాంబ
యక్షరక్షకీ వాసవాంబ
రాజ రాజేశ్వరి వాసవాంబ
లక్ష్మి శారద వాసవాంబ
వైశ్య పావనీ వాసవాంబ
శంకరి శుభకరి వాసవాంబ
షణ్ముఖ జననీ వాసవాంబ
సరనిజ లోచని వాసవాంబ
హంస స్సోహాం వాసవాంబ
క్షాత్ర తేజస్విని వాసవాంబ
సార్వ మంగళా వాసవాంబ
పసుపు కుంకుమతో వాసవాంబ
మంగళమమ్మా కన్యకాంబా
ఝంకార ప్రియ కన్యకాంబ
టక్కరి నాశకి కన్యకాంబ
డాంబిక మర్ధిని కన్యకాంబ
ఢమరుక ప్రియనే కన్యకాంబ
త్రిమూర్తి రూపిణి కన్యకాంబ
దానవ మర్దకి కన్యకాంబ
ధన్యుల జేయుము కన్యకాంబ
నిర్మల హృదయే కన్యకాంబ
పంకజ లోచని కన్యకాంబ
పాలచంద్ర సతి కన్యకాంబ
బాలామణి శ్రీ కన్యకాంబ
భక్త వత్సలే కన్యకాంబ
మునిజన సేవితె కన్యకాంబ
యుగ పోషకీ కన్యకాంబ
రాజేవ లోచని కన్యకాంబ
లలితా దేవి కన్యకాంబ
వారిజ నయనీ కన్యకాంబ
శతద్విజ గోత్రజ కన్యకాంబ
షడ్రసగ్రాహిణి కన్యకాంబ
సర్వసుఖప్రద కన్యకాంబ
హంసగమనినీ కన్యకాంబ
క్షామనివారిణి కన్యకాంబ
సద్గతి దాయిని కన్యకాంబ
అర్చన చేతుము కన్యకాంబ
(జయ) మంగళమమ్మా వాసవాంబా